భారీగా పెరిగిన బంగారం ధర

స్టాక్ మార్కెట్ పతనం మధ్య బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.1100 పెరిగిం

By Medi Samrat
Published on : 4 March 2025 8:39 PM IST

భారీగా పెరిగిన బంగారం ధర

స్టాక్ మార్కెట్ పతనం మధ్య బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.1100 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.89 వేల స్థాయికి చేరుకుంది. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల కొనుగోళ్లు పెరగడం, గ్లోబల్ ట్రెండ్ కారణంగా.. మంగళవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.1,100 పెరిగి రూ.89,000కి చేరుకున్నాయి. ఈ మేరకు ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది.

24 క్యారెట్ల‌ 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.89,000కి చేరుకుంది. దీని మునుపటి ముగింపు ధర 10 గ్రాములకు రూ.87,900. 22 క్యారెట్ల‌ 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.88,600కి చేరుకుంది. దీని మునుపటి ముగింపు ధర 10 గ్రాములకు రూ. 87,500. కిలో వెండి ధర రూ.1,500 పెరిగి రూ.98,000కి చేరుకుంది. సోమవారం వెండి కిలో ధర రూ.96,500 వద్ద ముగిసింది.

Next Story