ఎండాకాలం రాకముందే బంగారం ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.950 పెరిగి రూ.79,050లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరగడంతో రూ.86,240 పలుకుతోంది. ఇక కేజీ వెండి రేటు రూ.1000 పెరిగి రూ.1,07,000లకు చేరింది.
ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు. కానీ, ఒక రోజు తగ్గినా ఇంకో రోజు అమాంతం పెరుగుతున్నాయి.