హైదరాబాద్‌లో తగ్గిన‌ బంగారం ధరలు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి.

By Medi Samrat
Published on : 20 Jun 2025 4:44 PM IST

హైదరాబాద్‌లో తగ్గిన‌ బంగారం ధరలు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఒక్క రోజులో 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.600, 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గాయి. బంగారం, వెండి ధరలు ఇటీవలి గరిష్టాల నుండి పడిపోయాయి. దాదాపు ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.

శుక్రవారం నాటికి హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,480కి తగ్గింది.

అయితే, సంవత్సరం ప్రారంభంలో ధరలతో పోల్చితే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,500, 24 క్యారెట్ల బంగారం రూ. 78,000 వద్ద ఉండేది. ఇది జూన్ నాటికి ఏకంగా 28 శాతం పెరిగింది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరగడం దేశవ్యాప్త ట్రెండ్‌లో భాగం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది.

Next Story