బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండడం బంగారం ధరలకు ఆజ్యం పోస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 పెరిగి రూ.89,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 పెరిగి రూ.97,310 వద్ద కొనసాగుతుంది. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.100 స్వల్ప తగ్గుదలతో రూ.లక్ష 10వేల వద్ద కొనసాగుతోంది. అతి త్వరలోనే బంగారం ధర తులం రూ.లక్షకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.