హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,000 మార్క్‌ను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ అంతటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,070కి చేరుకుంది. నెల ప్రారంభంతో పోలిస్తే 22 క్యారెట్, 24 క్యారెట్ల బంగారం ధరలు 4.11 శాతం పెరిగాయి. అక్టోబర్ ప్రారంభంలో 22 క్యారెట్ల బంగారం ధర 70,500 రూపాయలు కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర 76,910 రూపాయలు. నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ. 400, 24 క్యారెట్ల బంగారంపై రూ. 430 ధర పెరిగింది. బంగారం ధరలు ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో సహా ఇతర ప్రధాన భారతీయ నగరాలలో కూడా బంగారం ధరలలో గణనీయంగా పెరిగాయి.
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ.80,220 ఉంది. కోల్‌కతా లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,400 ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ. 80,070 ఉంది. ముంబై, చెన్నైలలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,070 ఉంది.