Hyderabad : ఈ రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్‌లో బంగారం ధరలు మరోసారి ఆల్ టైమ్ హై రికార్డులను బద్దలు కొట్టాయి.
By Medi Samrat Published on 18 Oct 2024 10:00 AM GMTహైదరాబాద్‌లో బంగారం ధరలు మరోసారి ఆల్ టైమ్ హై రికార్డులను బద్దలు కొట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ.72,400 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,980కి చేరుకుంది. ఇప్పటివరకు అక్టోబర్‌లో హైదరాబాద్‌లో బంగారం ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
ఈ నెల ప్రారంభంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,910గా ఉంది. అంటే ఒక నెలలోపే.. 22 క్యారెట్ల బంగారం 2.69 శాతం పెరిగింది.. 24 క్యారెట్ల బంగారం కూడా ఇదే శాతం వృద్ధిని సాధించింది. నేటి 22 క్యారెట్ల ధర రూ.800 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ.870 రూపాయలు పెరిగాయి. బంగారం సంప్రదాయ పెట్టుబడి కావడంతో ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో కూడా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ.78,130 ఉంది. కోల్‌కతా లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,400 ఉండగా.. 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,980 ఉంది. ముంబై, చెన్నైలలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,980 ఉంది.