స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
Gold Rates Hike. దేశంలో బంగారం ధరలు మరోసారి పెరగడం మొదలయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో కాస్త తగ్గిన బంగారం
By Medi Samrat Published on 7 Jun 2021 4:07 AM GMTదేశంలో బంగారం ధరలు మరోసారి పెరగడం మొదలయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో కాస్త తగ్గిన బంగారం ధర జూన్ నెలలో మరోసారి పెరగడం మొదలైంది. బంగారం ధరలు జూన్ నుంచి పెరగడం ప్రారంభించాయి. సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై 10 రూపాయలు పెరిగింది. గత 10 రోజుల్లో బంగారం ధర 7 సార్లు పెరగగా... 2 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది.
మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఆదివారం నాటికి రూ.45,910 ఉంది. 67 రోజుల్లో ధర రూ.4,810 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... ఇప్పుడు రూ.50,080 ఉంది. అంటే 67 రోజుల్లో ధర రూ.5,240 పెరిగింది.
నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర సోమవారం ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,591 ఉంది. నిన్న ధర రూ.1 పెరిగింది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.36,728 ఉంది. నిన్న తులం ధర రూ.8 పెరిగింది. ఇక 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.45,910 ఉంది నిన్న ధర రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము రూ.5,008 ఉంది. నిన్న ధర రూ.1 పెరిగింది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.40,064 ఉంది. 10 గ్రాముల ధర రూ.50,080 ఉంది. ధర రూ.10 పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో ధరలు ఒకేలా ఉన్నాయి.
వెండి ధరలు గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గాయి. 1 సారి స్థిరంగా ఉన్నాయి. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.76.30 ఉంది. 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.610.40 ఉంది. నిన్న ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల ధర రూ.763 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,630 ఉండగా... కేజీ వెండి ధర... రూ.76,300 ఉంది. గత 6 నెలల్లో వెండి ధర రూ.13,300 పెరిగింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 47,110 (ఆదివారం రూ. 47,100 ).. 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 51,260 (ఆదివారం రూ. 51,250 ) ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 48,310 (ఆదివారం రూ. 48,300 ) 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 49,310 (ఆదివారం రూ. 49,300 ) ఉంది.