హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏకంగా ఐదు శాతానికి పైగా తగ్గాయి. గత నెలలో ధరలు తొమ్మిది సార్లు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టగా..

By Medi Samrat
Published on : 2 May 2025 4:09 PM IST

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏకంగా ఐదు శాతానికి పైగా తగ్గాయి. గత నెలలో ధరలు తొమ్మిది సార్లు ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టగా.. ఇప్పుడు తగ్గుదల కనిపిస్తూ ఉంది. శుక్రవారం నాడు 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం 2200 రూపాయలు తగ్గింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం శుక్రవారం 2,200 తగ్గి 9,55,100 చేరింది. 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 2000 రూపాయలు తగ్గి 8,75,500 రూపాయలకు చేరింది. హైదరాబాదులో 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం శుక్రవారం 87,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం 95,510 రూపాయలు ఉంది. ఊహించని విధంగా భారీగా బంగారం ధర పెరుగుదల దృష్ట్యా, ధర తగ్గుతుందని ఆశించిన ప్రజలు కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు.

Next Story