బంగారం ధరలు రోజు రోజుకు పెరిగి పోతుండటంతో సామాన్యుడు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,160గా ఉంది. కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ పసిడి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనుగోళ్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ అయినా గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 70-80 శాతం వరకు అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్‌ల పెంపు కారణంగా పెట్టుబడిదారులంతా పసిడి వైపు ఆసక్తి చూపుతుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఈ సంవత్సరం ఏకంగా 10 శాతం పసిడి ధరలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.