అసలే పెళ్లిళ్ల సీజన్,కొండెక్కిన బంగారం ధరలు..ఎంతంటే?
By Knakam Karthik
అసలే పెళ్లిళ్ల సీజన్,కొండెక్కిన బంగారం ధరలు.. ఎంతంటే?
వివాహాల సీజన్‌లో బంగారం ధరలు పెరిగి సామాన్యులను భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.1000 తగ్గి రూ.1,06,000లకు చేరింది.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించిన ట్రంప్.. తదుపరి మెక్సికోకు మాత్రం రిలాక్సేషన్ ఇచ్చారు. అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని కెనడా ప్రకటించగా.. చైనా కూడా ప్రతిస్పందించనున్న నేపథ్యంలో సోమవారం అమెరికా సహా వరల్డ్ వైడ్ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అనిశ్చితి పరిస్థితుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చే కనకానికి పెట్టుబడులు మళ్లడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి ధర కొండెక్కింది.