బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో అనుసరిస్తున్న కఠిన వైఖరి బంగారం ధరలు తగ్గడానికి కారణమయ్యాయి. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సోమవారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,446 వద్ద ఉండగా, బుధవారం నాటికి రూ. 99,017కి పెరిగింది. వారాంతానికి మళ్లీ తగ్గి రూ. 98,534 వద్ద స్థిరపడింది.
గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం మాత్రం పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావంతో బంగారం ధరలు తిరిగి ఎగబాకాయి. 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,530 పెరిగి రూ.1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,400 పెరిగి రూ.92,900కు చేరుకుంది.