Gold Price : లక్షకు రూ.200 దూరంలో బంగారం ధర..!
బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంటోంది. చైనా-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.
By Medi Samrat
బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంటోంది. చైనా-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. PTI ప్రకారం.. ఏప్రిల్ 21 న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 99,800కి చేరుకుంది. రేపు అంటే ఏప్రిల్ 22 నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు లక్ష రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
PTI నివేదిక ప్రకారం.. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1650 రూపాయలు పెరిగింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.99,800గా ఉంది. అంటే రూ.లక్ష కావడానికి కేవలం రూ.200 మాత్రమే దూరంలో ఉంది.
అదే సమయంలో MCX (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో సాయంత్రం 4.42 గంటలకు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.96,696గా ఉంది. MCX ఫ్యూచర్ గోల్డ్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో 10 గ్రాములకు రూ.96,726గా నమోదైంది.
అంతకుముందు శుక్రవారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.98,150గా ఉంది. శుక్రవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.20 తగ్గింది. స్థానిక మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.99,300కి చేరిందని పీటీఐ తెలిపింది.
గతేడాది డిసెంబర్ 31 నుంచి ఇప్పటి వరకు 10 గ్రాముల బంగారం ధర 26 శాతం పెరిగింది. డిసెంబర్ నుంచి బంగారం ధర 10 గ్రాములకు రూ.20,850 పెరిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై 90 రోజుల మారటోరియం విధించారు. ఇది పూర్తిగా తొలగించబడనప్పటికీ. చైనా, అమెరికాల మధ్య కొనసాగుతున్న టారిఫ్ వార్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి అంటే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని కారణంగా డిమాండ్ పెరిగి ధర పరుగులు పెడుతుంది.