బంగారం ధరలు రూ.1,650 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.98,100కి చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.9 శాతం(24 క్యారెట్ల) స్వచ్ఛత కలిగిన విలువైన మెటల్ మంగళవారం 10 గ్రాములకు రూ.96,450 వద్ద ముగిసింది. కాగా బంగారం ధరలు జనవరి 1న రూ.79,390 ఉండగా.. రూ. 18,710 లేదా 23.56 శాతం పెరిగి 10 గ్రాములు రూ.98,100కి చేరాయి.
99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం((22 క్యారెట్ల)) ధర కూడా రూ. 1,650 పెరిగి 10 గ్రాముల తాజా గరిష్ట స్థాయి రూ.97,650కి చేరుకుంది. వెండి ధర కిలోకు రూ.1,900 పెరిగి రూ.99,400కి చేరుకుంది. వెండి మంగళవారం కిలో రూ.97,500 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 3,318 డాలర్లకు చేరుకుంది. గోల్డ్ మన్ శాక్స్ అంచనా ప్రకారం బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి రూ. 1.25 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య యుద్ధం, ట్రంప్ సుంకాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.