పసిడి ధరలు సామాన్యులకు దడపుట్టిస్తున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగింది. దీంతో పది గ్రాముల విలువైన బంగారం రూ. 90,670 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.100 పెరిగి.. ఒక కిలో రూ.1,05,200కు చేరింది.
22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి.. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 83,110 వద్ద ఉంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,670గా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,820గా ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో సమానంగా రూ. 83,110 వద్ద ఉంది. ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.83,260గా ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో కిలో వెండి ధర రూ.1,05,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.1,14,200గా ఉంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,670 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,110 ఉంది. గుంటూరులో లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,670 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.83,110 ఉంది. విజయవాడ, ఖమ్మం వంటి ఇతర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాతున్నాయి.