Gold Price : ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర

సోమవారం నాడు బంగారం ధరలు పెరిగాయి. రూ. 250 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ.78,700కి చేరింది

By Medi Samrat  Published on  7 Oct 2024 5:10 PM IST
Gold Price : ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర

సోమవారం నాడు బంగారం ధరలు పెరిగాయి. రూ. 250 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రూ.78,700కి చేరింది. శుక్రవారం 10 గ్రాములు బంగారం ధ‌ర‌ రూ.78,450 వద్ద స్థిరపడింది. శుక్రవారం కిలో వెండి రూ.94,200 నుంచి రూ.200 తగ్గి రూ.94,000కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 22 క్యారెట్ల బంగారం ధ‌ర 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.78,300గా ఉంది. అంత‌కుముందు గ్రాముల ధర రూ.78,100గా ఉంది.

దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడమే బంగారం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. అంతేకాకుండా ఈక్విటీ మార్కెట్లలో క్షీణత కూడా బంగారం పెరుగుద‌ల‌కు సహాయపడిందని, పెట్టుబడిదారులు బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపిన‌ట్లుగా పేర్కొన్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ముంబై - రూ. 78,700 - రూ.78,300

-----------------------------------------

చెన్నై - రూ. 78,700 - రూ.78,300

------------------------------------------

కోల్‌కతా - రూ. 78,700 - రూ.78,300

-------------------------------------------

హైదరాబాద్ - రూ. 78,700 - రూ.78,300

-------------------------------------------

బెంగళూరు -రూ. 78,700 - రూ.78,300

----------------------------------------------

భువనేశ్వర్ - రూ. 78,700 - రూ.78,300

Next Story