దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలమైన డిమాండ్ కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ ప్రకారం.. రాజధాని ఢిల్లీలో మంగళవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 5,100 పెరిగి రూ. 1.5 లక్షల మైలురాయిని అధిగమించింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ. 1,53,200 వద్ద ట్రేడవుతోంది(అన్ని పన్నులతో కలిపి). గత ముగింపు స్థాయి రూ. 10 గ్రాములకు రూ.1,48,100గా ఉంది.
స్థానిక బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు కూడా బలపడి తాజాగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వెండి రూ.20,400 లేదా దాదాపు 7 శాతం పెరిగి కిలోకు రూ.3,23,000కి (అన్ని పన్నులతో కలిపి) చేరుకుంది. సోమవారం వెండి ధరలు రూ. 10,000 పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో కిలో రూ. 3 లక్షల మార్కు అధిగమించింది.
Forex.com ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో తొలిసారిగా గోల్డ్ ఔన్స్‌కు USD 4,700 స్థాయిని అధిగమించింది. బంగారం ఔన్సుకు USD 66.38 లేదా 1.42 శాతం పెరిగి USD 4,737.40కి చేరుకుంది. సిల్వర్ కూడా ఓవర్సీస్ ట్రేడ్‌లో ఔన్స్‌కు 95.88 డాలర్ల కొత్త రికార్డును తాకింది.