విక్రేతల కోసం జీరో కమీషన్‌ను పరిచయం చేసిన 'గ్లో రోడ్'
GlowRoad introduces zero-commission for sellers. భారతదేశంలో సుప్రసిద్ధ సోషల్ కామర్స్ కంపెనీలలో ఒకటైన గ్లో రోడ్ నేటి నుంచి
By Medi Samrat Published on 29 May 2022 5:30 PM ISTభారతదేశంలో సుప్రసిద్ధ సోషల్ కామర్స్ కంపెనీలలో ఒకటైన గ్లో రోడ్ నేటి నుంచి విక్రేతల కోసం జీరో కమీషన్ ను పరిచయం చేసినట్లు వెల్లడించింది. దీంతో గ్లో రోడ్ విక్రేతలు.. ఆన్‌లైన్‌లో ఫీజులను గురించి ఎలాంటి బాధ లేకుండా మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడంతో పాటుగా తమ ఉత్పత్తులను విక్రయించడం సాధ్యమవుతుంది. ఇకపై కేవలం రవాణా, లాజిస్టిక్స్ సేవల కోసం తగిన మొత్తాలను చెల్లిస్తే సరిపోతుంది. అన్ని విభాగాలలోనూ జీరో కమీషన్‌ను పరిచయం చేయడం వల్ల దేశవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు (ఎంఎస్‌ఎంఈలు)కు మరిన్ని అవకాశాలను సృష్టించడానికి దోహదపడుతుంది.
మరింత మంది విక్రేతలు గ్లో రోడ్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా.. ఇప్పుడు విభిన్న విభాగాల్లోకి విస్తరించడమూ సాధ్యమవుతుంది. వీటి తో పాటుగా గ్లో రోడ్ ఇప్పుడు పలు ఆఫర్లు, వాలెట్ క్రెడిట్స్‌ను సైతం అందిస్తుంది. ఇది ఇన్ల్ఫూయెన్సర్లకు సంపాదనతో పాటుగా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునే అవకాశమూ అందిస్తుంది.
గ్లోరోడ్ ఫౌండర్ అండ్ సీఈఓ కునాల్ సిన్హా మాట్లాడుతూ ''భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎంఎస్‌ఎంఈలు, వ్యవస్ధాపకుల కోసం డిజిటల్ వ్యాపారాన్ని చేరువ చేయడానికి మేము గ్లోరోడ్‌ను ప్రారంభించాం. వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సౌకర్యవంతంగా, నమ్మకమైనదిగా మారుస్తూ గ్లోరోడ్ యొక్క సేవలను వినియోగించుకునేలా విక్రేతలు, ఇన్ల్ఫూయెన్సర్‌లపై దృష్టిసారించామని అన్నారు. గృహిణిలు, యువత, చిరు వ్యాపారాలు, ఇతరులు సహా డిజిటల్ వ్యాపారవేత్తలుగా మారాలనే లక్షలాది మంది వినియోగదారులకు సోషల్‌మీడియా ద్వారా వారి ఇంటి నుంచే సులభంగా సంపాదించే మార్గాన్ని గ్లోరోడ్ అందిస్తుంది.