వాటర్-థీమ్డ్ టౌన్ షిప్‌తో వస్తున్న జీ స్క్వేర్
G Square Launches India’s 1st Water-Themed Plot Township. భూ సేకరణలో అత్యంత అనుభవం కలిగిన జి స్క్వేర్ హౌసింగ్..
By Medi Samrat
భూ సేకరణలో అత్యంత అనుభవం కలిగిన జి స్క్వేర్ హౌసింగ్.. బళ్ళారిలో 100 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధిచేసిన ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తున్నట్టు ఈరోజు ప్రకటించింది. రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటిగా వున్న ఈ ప్రాజెక్ట్ జి స్క్వేర్ సిటీ, బళ్ళారిలో (బియుడిఎ & ఆర్ఇఆర్ఎ) అనుమతి పొందిన తొలి ప్రాజెక్ట్. 100 ఎకరాల భూమిని ఇళ్ళస్థలాలుగా అభివృద్ధిచేసిన ఈ ప్రాపర్టీలో 821 ప్లాట్లు వుంటాయి, ప్రారంభ ధర 34 లక్షల రూపాయలు. భారతదేశపు మొట్టమొదటి వాటర్ థీమ్డ్ ప్లాట్ టౌన్షిప్ అయిన దీంట్లో ఒక లక్ష చదరపు అడుగుల విలాసవంతమైన క్లబ్ హౌస్, హెలీ పాడ్ వంటి ప్రత్యేక అంశాలతో పాటు 200లకు పైగా ఇతర అన్ని సౌకర్యాలున్నాయి. ప్రారంభోత్సవ ధర చదరపు అడుగుకి రూ. 3,100 ఉండగా.. ఎర్లీబర్డ్ ఆఫర్‌గా మొదటి 25 బుకింగ్స్ కి అడుగును రూ. 2,850 లకే అందిస్తోంది.
జి స్క్వేర్ సిటీ బళ్ళారి జిల్లాలో తొలిసారిగా రేరా అనుమతి పొందిన ప్రాజెక్ట్. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు రోడ్డు ద్వారా బళ్ళారి అనుసంధానమై వుంది. జాతీయ రహదారి 13 (ఎన్హెచ్-13), జాతీయ రహదారి (ఎన్హెచ్-63), రాష్ట్ర రహదారి 19 (ఎఎస్హెచ్-19), రాష్ట్ర రహదారి 132 (ఎఎస్హెచ్-132) ద్వారా బళ్ళారి అనుసంధానమై వుంటుంది. జి స్క్వేర్ సీఈవో ఈశ్వర్ మాట్లాడుతూ.. "జి స్క్వేర్ వారి వాటర్ థీమ్డ్ టౌన్షిప్ అనేది బళ్ళారిలో 200+ సౌకర్యాలతో ప్రీమియం ఇళ్ళ స్థలాలు అందించాలన్న పెద్ద దృక్పథంలో భాగంగా వచ్చింది. జి స్క్వేర్ సిటీ బళ్ళారిలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి అని అన్నారు.