షాంపూ కోసం రచ్చ.. 20 వేలు జరిమానా.?

'బిగ్ బిలియన్ సేల్' రోజులలో ఒక ఉత్పత్తికి గరిష్ట రిటైల్ ధర (MRP) కంటే ఎక్కువ వసూలు చేసిన కస్టమర్‌కు పరిహారం చెల్లించాలని

By Medi Samrat  Published on  8 Dec 2023 3:00 PM GMT
షాంపూ కోసం రచ్చ.. 20 వేలు జరిమానా.?

'బిగ్ బిలియన్ సేల్' రోజులలో ఒక ఉత్పత్తికి గరిష్ట రిటైల్ ధర (MRP) కంటే ఎక్కువ వసూలు చేసిన కస్టమర్‌కు పరిహారం చెల్లించాలని బెంగళూరులోని వినియోగదారుల న్యాయస్థానం ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసిన షాంపూ కోసం ఆమె చెల్లించిన మొత్తం దాని MRP కంటే ఎక్కువగా ఉందని గమనించిన బెంగళూరు వాసి కోర్టుకు ఎక్కారు.

బెంగళూరులోని ప్యాలెస్ గుట్ట హల్లి నివాసి సౌమ్య 2019 అక్టోబర్ లో జరిగిన బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ నుంచి షాంపూని కొన్నారు. ఆమె కొనుగోలు చేసిన పతంజలి హెయిర్ క్లెన్సర్ అసలు ధర రూ. 95 మాత్రమే.. అయితే ఆమెను నుంచి రూ. 191 వసూలు చేశారు. దీంతో ఆమె ఫ్లిప్ కార్ట్ కస్టమర్ సర్వీస్ కు ఫిర్యాదు చేసింది. ఆమెకు రీఫండ్ చేస్తామని చెప్పారు. అయితే ఫ్లిప్ కార్ట్ నుంచి ఎంతకీ సమాధానం రాకపోవడంతో ఆమె ఫ్లిప్ కార్ట్ పై దావా వేసింది. బెంగళూరు 4 అడిషనల్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్పూట్స్ రీడ్రెసల్ కమిషన్ లో ఫిర్యాదు చేసింది. అధిక ధరలకు షాంపూ బాటిల్ ను విక్రయించినందుకు ఫ్లిప్ కార్ట్, హచ్ బీకే ఎంటర్ ప్రైజెస్ పై ఫిర్యాదు చేసింది కస్టమర్ పై అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ఫ్లిప్ కార్ట్ కంపెనీ, హెచ్ బీకే ఎంటర్ ప్రైజెస్ లు కోర్టుకు ఎటువంటి సమాధానం చెప్పలేకపోవడంతో సౌమ్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది జడ్జి. వినియోగదారులకు సేవలందించడంతో లోపానికి పరిహారంగా రూ. 10వేలు, కోర్టు ఛార్జీలు రూ. 5వేలు, మోసపూరిత వ్యాపారం చేసినందుకు రూ. 5వేల చొప్పున మొత్తం రూ.20 వేలు కస్టమర్ సౌమ్యకు ఫ్లిప్ కార్ట్ సంస్థ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి ఏడాది బిగ్ బిలియన్ డేస్ ను ఫ్లిప్‌కార్ట్ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఈవెంట్ సమయంలో ఎన్నో ప్రోడక్ట్స్ పై భారీ తగ్గింపులు ఉంటాయి.

Next Story