అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అవును టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ ఓ ఇంటర్వ్యూలో.. కంపెనీ త్వరలో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించవచ్చని చెప్పారు. భారతదేశంలో కొత్త ఫ్యాక్టరీని స్థాపించడానికి టెస్లా ఆసక్తి చూపుతుందా అని మస్క్‌ని అడగగా.. ఆయన సానుకూలంగా బదులిచ్చారు. ఇటీవలే కొంతమంది టెస్లా ఎగ్జిక్యూటివ్‌లు అవకాశాలను అన్వేషించడానికి భారత మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు.. భారత ప్రభుత్వ అధికారులను కూడా కలిశారు. నివేదికల ప్రకారం.. టెస్లా అధికారులు భారతదేశంలో తయారీ కర్మాగారం, R&D యూనిట్‌ను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన EV తయారీదారు అయిన టెస్లాకు.. భారతదేశంలో తన వాహనాలను విక్రయించాలనుకుంటే.. తయారీ ప్లాంట్‌ను ఇక్కడే ఏర్పాటు చేయాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతానికి దీనిపై కంపెనీ గానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. మీడియా నివేదికల ప్రకారం.. టెస్లా త్వరలో భారతదేశంలో ఫ్యాక్టరీ కోసం స్థలాన్ని ఖరారు చేసుకునే పనిలో పడిందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ పనులు ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. కార్లు అధికారికంగా వచ్చే ఏడాది లేదా 2025 నాటికి భారతదేశంలో అమ్మకానికి అందించబడతాయి.