Bank Holidays : వచ్చే 11 రోజులలో బ్యాంకుల‌కు 8 సెల‌వు దినాలు..!

పండగ సీజన్ మొదలైంది. దుర్గాపూజ, దసరా వచ్చే ఈ 11 రోజులలో జరుపుకోనున్నారు.

By Medi Samrat  Published on  20 Oct 2023 3:15 PM IST
Bank Holidays : వచ్చే 11 రోజులలో బ్యాంకుల‌కు 8 సెల‌వు దినాలు..!

పండగ సీజన్ మొదలైంది. దుర్గాపూజ, దసరా వచ్చే ఈ 11 రోజులలో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రోజుల్లో బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. అక్టోబరు 25, 26, 27 వరకు దుర్గాపూజ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన బ్యాంకు సెలవుల క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవు. ఇది కాకుండా.. లక్ష్మీ పూజ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్‌లోని మిగిలిన పది రోజులలో కూడా కొన్ని రోజుల‌లో బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. అక్టోబర్‌లోని మిగిలిన 11 రోజులలో (అక్టోబర్ 21-31 మధ్య) ఎనిమిది రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.

పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇలా ఉన్నాయి..

అక్టోబర్ 21: (శనివారం) – దుర్గాపూజ (మహా సప్తమి) – త్రిపుర, అస్సాం, మణిపూర్, బెంగాల్‌లలో బ్యాంకులు మూసివేయబడ‌తాయి.

అక్టోబర్ 23: (సోమవారం) - దసరా (మహానవమి) / ఆయుధ పూజ / దుర్గాపూజ / విజయ దశమి - త్రిపుర, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, అస్సాం, ఆంధ్రప్రదేశ్, కాన్పూర్, కేరళ, జార్ఖండ్, బీహార్‌లలో బ్యాంకులు మూసివేయబడ‌తాయి.

అక్టోబర్ 24: (మంగళవారం) – దసరా/దసరా (విజయదశమి)/దుర్గాపూజ – ఆంధ్రప్రదేశ్, మణిపూర్ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి.

అక్టోబర్ 25: (బుధవారం) – దుర్గా పూజ (దస్సేన్) – సిక్కింలో బ్యాంక్ మూసివేయబ‌డ‌తాయి.

అక్టోబర్ 26: (గురువారం) - దుర్గాపూజ (దస్సేన్) / విలీన దినం - సిక్కిం, జమ్మూ మరియు కాశ్మీర్‌లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

27 అక్టోబర్: (శుక్రవారం) - దుర్గా పూజ (దసైన్) - సిక్కింలో బ్యాంకుల‌కు సెల‌వు.

28 అక్టోబర్: (శనివారం) - లక్ష్మీ పూజ - బెంగాల్‌లో బ్యాంకుల‌కు సెల‌వు.

31 అక్టోబర్: (మంగళవారం) - సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు - గుజరాత్‌లో బ్యాంకుల‌కు సెల‌వు.

అక్టోబర్ నెలలో బ్యాంకులకు సెలవు దినాల్లో కూడా బ్యాంకుల ఆన్‌లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. దీంతో ఏవైనా అత్య‌వ‌స‌ర లావాదేవీల కోసం ఆన్‌లైన్ సేవ‌లు వినియోగించుకోవ‌చ్చు.

Next Story