క్రెడిట్ స్కోర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
లోన్లు తీసుకోవాలన్న, క్రెడిట్ కార్డు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మందికి క్రెడిట్ స్కోర్ గురించి తెలిసే ఉంటుంది.
By అంజి Published on 27 May 2024 4:18 PM ISTక్రెడిట్ స్కోర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
లోన్లు తీసుకోవాలన్న, క్రెడిట్ కార్డు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా మందికి క్రెడిట్ స్కోర్ గురించి తెలిసే ఉంటుంది. ఇటీవల సాఫ్ట్ ఎంక్వైరీని అన్ని పేమెంట్ యాప్‌లు అందిస్తున్నాయి కాబట్టి తెలుసుకోవడం మరింత సులభమైంది. అసలైతే క్రెడిట్ స్కోర్‌ను బ్యూరోలు తెలియజేస్తాయి. ప్రధానంగా నాలుగు క్రెడిట్ బ్యూరోల ద్వారా క్రెడిట్ స్కోర్ తెలుసుకోవచ్చు. అందులో ప్రసిద్ధి చెందింది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. 2000లో దీన్ని స్థాపించారు. ఇది ఆర్బీఐ గుర్తింపు పొందిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ.
ఇది అందించే స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఇది అనేక బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో అనుబంధం కలిగి ఉంది. 60 కోట్లకుపైగా భారతీయులు, 3.2 కోట్ల కార్పొరేట్ సంస్థల క్రెడిట్ రిపోర్ట్‌లను నిర్వహిస్తోంది. తర్వాత ఎక్స్‌పీరియన్ 2010 నుంచి భారత్‌లో పని చేయడం ప్రారంభించింది. సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ సంస్థ అందించే స్కోర్ 300 నుంచి 850 వరకు ఉంటుంది. ఈక్విఫ్యాక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా టాప్ - 5 క్రెడిట్ బ్యూరోలలో ఒకటి. 1898 నుంచి ఉన్నప్పటికీ 2010లో లైసెన్స్ పొందింది. 1 నుంచి 999 వరకు క్రెడిట్ స్కోర్ సూచిస్తుంది.
దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు సిబిల్ రిపోర్ట్‌ను ప్రామాణికంగా పరిగణిస్తున్నాయి. 2017 నుంచి ఏడాదికోసారి ఉచితంగా తనిఖీ చేసుకోవడానికి సిబిల్ అనుమతి ఇస్తుంది. సిబిల్ స్కోరు భారత్‌లో లోన్, ఇతరత్రా లావాదేవీలకు ప్రామాణికంగా మారింది. సిబిల్ అందించే నివేదికను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని కూడా పిలుస్తారు. సీఐఆర్ అంటే రుణాలు, చెల్లింపు చరిత్రలను నిర్వహించే పత్రం. అలాగే సిబిల్ స్కోరుతో పాటు క్రెడిట్‌కు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలను కలిగి ఉండే నివేదిక.
ఇందులో ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఎన్ని లోన్లు తీసుకున్నారు. లోన్‌కు సంబంధించిన పెండింగ్ అమౌంట్, ఇప్పటి వరకు తీసుకున్న అన్ని లోన్ల వివరాలు ఉంటాయి. క్రెడిట్ రిపోర్ట్ అనేది మీ క్రెడిట్‌కు ప్రొగెస్ రిపోర్ట్ లాగా ఉపయోగపడుతుంది. రుణ దరఖాస్తు ప్రక్రియలో ప్రయోజనాలను పొందగలిగేది, లేనిది సిబిల్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే అది మీకు అంత మంచిది.