తెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినడానికి జనం భయపడుతూ ఉన్నారు. చికెన్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఇక ఆదిలాబాద్‌లో అయితే ఏకంగా చికెన్ మార్కెట్ బంద్ అయింది. వారం పాటు చికెన్ మార్కెట్ మూసివేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. ఆదిలాబాద్ పట్టణంలోని దాదాపు 200 చికెన్ షాపుల్లో ప్రతి ఆదివారం 15 టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. కానీ గత ఆదివారం ఫిబ్రవరి 16న కనీసం 3 టన్నుల చికెన్ కూడా అమ్ముడుపోలేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ద్వీప ప్రాంతంలోని బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది, ఇది దాదాపు 95 గ్రామాలను ప్రభావితం చేసింది. స్థానిక పౌల్ట్రీ రైతులు గణనీయమైన నష్టాలను నివేదించారు, గత 15 రోజులుగా కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. వ్యాధి వ్యాప్తి చెందడంతో స్థానిక కోళ్ల పెంపకందారులు, వ్యాపారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.