వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారి కోసం 'స్వనిధి క్రెడిట్ కార్డులను' అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను పీఎం మోదీ ఈ రోజు కేరళలో లాంచ్ చేశారు. పట్టణ జీవనోపాధిని బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా ప్రధాని మోదీ ప్రధానమంత్రి స్వనిధి క్రెడిట్ కార్డును కూడా ప్రారంభించారు. ఇది వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనిస్తుంది.
పీఎం స్వనిధి స్కీమ్‌లో భాగంగా రెండో విడత లోన్ తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇది యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు. మ్యాగ్జిమమ్ లిమిట్ రూ.30 వేలు. వ్యాలిడిటీ ఐదు ఏళ్లు ఉంటుంది. కార్డు కోసం లోన్ ఇచ్చిన బ్యాంకులో సంప్రదించాల్సి ఉంటుంది.
పీఎం స్వనిధి పథకం గడువును కేంద్ర ప్రభుత్వం 2030 మార్చి 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. తొలి విడతలో రూ.15 వేలు, అది చెల్లించాక రెండో విడతలో రూ.25 వేలు, మూడో విడతలో రూ.50 వేలు మంజూరు చేస్తారు. లోన్ కోసం స్వనిధి పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.