త్వరలోనే కొత్త పాన్‌కార్డులు.. ఉచితంగానే పంపిణీ చేయనున్న కేంద్రం

పాన్‌ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. దీని కోసం రూ.1435 కోట్లు కేటాయించింది.

By అంజి  Published on  3 Dec 2024 5:48 AM GMT
central govt, digital pancards, National news

త్వరలోనే కొత్త పాన్‌కార్డులు.. ఉచితంగానే పంపిణీ చేయనున్న కేంద్రం

పాన్‌ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. దీని కోసం రూ.1435 కోట్లు కేటాయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న పాన్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌తో పాటు కొత్త కార్డులను తీసుకురానుంది. ఆ కార్డులను ఉచితంగా జారీ చేయనున్నట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ సంఘం ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసినట్టు తెలిపారు.

ఈ క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత పాన్‌ కార్డు.. పన్ను చెల్లింపుదారులు సులువుగా, వేగంగా, మెరుగైన సర్వీసులు పొందడానికి తోడ్పడుతుంది. అయితే ఈ కొత్త కార్డుల కోసం మనం మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్‌ కార్డు 2.0 పేరుతో డిజిటల్‌ కార్డులు పంపిణీ ఉచితంగానే చేయనున్నారు. క్యాబినెట్‌ మీటింగ్‌లో ఈ ప్రాజెక్టుతో పాటు విద్యార్థుల కోసం రూ.6 వేల కోట్లతో వన్‌ నేషన్‌ - వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ పథకం కూడా ప్రవేశపెట్టనున్నట్టు నిర్ణయం తీసుకున్నారు.

Next Story