యాపిల్ iPhone 13 (128GB)ని రూ. 50,900కే .. ఎక్స్ఛేంజ్ ఆఫర్ గురించి తెలుసుకోండి

Buy Apple iPhone 13 128GB At Rs 50,900. యాపిల్ iPhone 13 (128GB) మొబైల్ ఫోన్ ఇండియా iStore లో రూ. 50,900

By Medi Samrat  Published on  2 Feb 2022 12:46 PM GMT
యాపిల్ iPhone 13 (128GB)ని రూ. 50,900కే .. ఎక్స్ఛేంజ్ ఆఫర్ గురించి తెలుసుకోండి

యాపిల్ iPhone 13 (128GB) మొబైల్ ఫోన్ ఇండియా iStore లో రూ. 50,900 (MRP రూ. 79,900) కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అంత తక్కువ ధరకు లేటెస్ట్ మొబైల్ దక్కాలంటే చాలా నిబంధనలు, షరతులు ఉన్నాయని గమనించండి. ఇది ఎక్స్ఛేంజ్ ఆఫర్ అని తెలుసుకోండి. పాత iPhone XRని పరిగణనలోకి తీసుకున్న తర్వాత తగ్గింపు ధర లెక్కించబడుతుంది. ఇండియా iStore వెబ్‌సైట్ రిటైలర్ రూ. 5,000 విలువైన ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. కస్టమర్‌లు ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లతో అదనంగా రూ. 6,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వినియోగదారులు iPhone XR 64GB (మంచి స్థితి)పై రూ. 18,000 వరకు విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు, షరతుల ప్రకారం ఎక్స్ఛేంజ్ ఆఫర్ మారుతూ ఉంటుంది. ఐఫోన్ 13 ఐదు రంగులలో వస్తుంది రెడ్, పింక్, మిడ్‌నైట్, బ్లూ మరియు స్టార్‌లైట్ వైట్. వినియోగదారులు రెండు స్టోరేజ్ ఆప్షన్‌ల మధ్య కూడా ఎంచుకోవచ్చు. స్టోర్ 256GB మరియు 512GB మోడల్‌లపై కూడా ఇలాంటి ఆఫర్‌లను అందిస్తోంది. 256GB వేరియంట్ ను రూ. 60,900 (MRP రూ. 89,900), 512GB వేరియంట్ ను రూ. 80,900 (MRP రూ. 1,09,900)కి సొంతం చేసుకోవచ్చు. రెండు మోడల్స్ పై ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 5,000 ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్ మరియు రూ. 6,000 క్యాష్‌బ్యాక్ డీల్‌తో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు సమీపంలోని స్టోర్‌కు వెళ్ళవచ్చు. ఈ డీల్‌లు Aptronixindia, FutureWorld, MyImagineStore వంటి భాగస్వామి ఇ-రిటైలర్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి.


Next Story