ఎయిర్ టెల్ కు సంబంధించిన డేటా లీక్ అవ్వలేదట..!

డార్క్ వెబ్‌లో 375 మిలియన్ల భారతీయ వినియోగదారుల డేటా అమ్మకానికి ఉందని ఆరోపణలు వచ్చాయి.

By Medi Samrat  Published on  5 July 2024 5:36 PM IST
ఎయిర్ టెల్ కు సంబంధించిన డేటా లీక్ అవ్వలేదట..!

డార్క్ వెబ్‌లో 375 మిలియన్ల భారతీయ వినియోగదారుల డేటా అమ్మకానికి ఉందని ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఎయిర్ టెల్ యూజర్లు అంటూ కథనాలు వచ్చాయి. అయితే ఈ భారీ డేటా ఉల్లంఘనకు సంబంధించిన ఆరోపణలను భారతీ ఎయిర్‌టెల్ ఖండించింది. స్వార్థ ప్రయోజనాలతో ఎయిర్‌టెల్ ప్రతిష్టను దిగజార్చడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ భారతీ ఎయిర్ టెల్ వివరణ ఇచ్చింది.

375 మిలియన్ల ఎయిర్‌టెల్ వినియోగదారుల వివరాలు, వారి ఫోన్ నంబర్, ఇమెయిల్, చిరునామా, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ నంబర్ డార్క్ వెబ్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని కొన్ని కథనాలు వచ్చాయి. అలాంటిది ఏమీ జరగలేదని ఎయిర్ టెల్ చెప్పడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. "ఎయిర్‌టెల్ కస్టమర్ డేటా అమ్మకానికి ఉందని ఆరోపిస్తున్నారు. మేము సమగ్ర దర్యాప్తు చేసాము. ఎయిర్‌టెల్ సిస్టమ్స్ నుండి ఎటువంటి ఉల్లంఘన జరగలేదదు" అని ఎయిర్‌టెల్ ప్రతినిధి తెలిపారు. డార్క్ వెబ్ లో 50,000 డాలర్లకు డేటాను అమ్మకానికి పెట్టినట్లు కథనాలు వచ్చాయి.

Next Story