మార్చిలో 12 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు.. లిస్ట్ ఇదే

మార్చి నెల‌లో మొత్తంగా 12 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవులను బట్టి బ్యాంకులు మూసి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2023 8:40 AM GMT
మార్చిలో 12 రోజులు బ్యాంకుల‌కు సెల‌వు.. లిస్ట్ ఇదే

ఫిబ్ర‌వ‌రి నెల మ‌రో నాలుగు రోజుల్లో పూర్తి కాబోతుంది. త‌దుప‌రి మార్చి నెల ప్రారంభం కానుంది. చాలా ముఖ్య‌మైన పండుగ‌లు మార్చిలో ఉన్నాయి. దీంతో బ్యాంకులకు సెల‌వులు ఉంటాయి. ఏ ఏ రోజుల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉంటాయో తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. ముందుగా సెల‌వులు తెలుసుకోవ‌డం ద్వారా బ్యాంకుల్లో ఏదైన ప‌ని ఉంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసుకోవ‌చ్చు. మొత్తంగా మార్చి నెల‌లో 12 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ప్రకారం, ప్రభుత్వ , ప్రైవేటు బ్యాంకులు ఆయా సెలవు రోజుల్లో మూతపడనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ సెలవులను బట్టి బ్యాంకులు మూసి ఉండ‌నున్నాయి.

సెల‌వుల జాబితా ఇదే..

మార్చి 3 - శుక్ర‌వారం- చాప్‌చార్ కుట్ సంద‌ర్భంగా మ‌ణిపూర్‌లో బ్యాంకుల‌కు సెల‌వు

మార్చి 5 - ఆదివారం

మార్చి 7 - మంగళవారం -హోలీ (రెండో రోజు) - కొన్ని రాష్ట్రాల్లో

మార్చి 8 - బుధ‌వారం- ధులేటి దొల్యాత్రా/ హోలీ/ యాసాంగ్ రెండో రోజు

మార్చి 9 - గురువారం - బిహార్‌లో హోలీ వేడుకలు నిర్వహిస్తారు

మార్చి 11 - రెండో శ‌నివారం

మార్చి 12 - ఆదివారం

మార్చి 19 - ఆదివారం

మార్చి 22 - ఉగాది

మార్చి 25 - నాలుగో శనివారం

మార్చి 26 - ఆదివారం

మార్చి 30 - శ్రీరామనవమి

Next Story