అలర్ట్.. వచ్చే నెలలో 16 రోజులు మూతపడనున్న బ్యాంకులు
2024 సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ నెల ముగియనుంది.
By Medi Samrat
2024 సంవత్సరం ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ నెల ముగియనుంది. వచ్చే జనవరి నెలలో బ్యాంకులకు చాలా సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ బ్యాంకింగ్ సంబంధిత పనులు షెడ్యూల్ చేసుకునేందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో జనవరి 2024 సెలవుల జాబితా విడుదల చేయబడింది. వచ్చే జనవరిలో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
ఏ ఏ రోజు, ఏ ఏ ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం..
01 జనవరి - నూతన సంవత్సరం - ఐజ్వాల్, చెన్నై, గాంగ్టక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, షిల్లాంగ్.
02 జనవరి - నూతన సంవత్సర వేడుకలు - ఐజ్వాల్
07 జనవరి - ఆదివారం (వారపు సెలవుదినం) - పబ్లిక్ హాలిడే
11 జనవరి - మిషనరీ డే - ఐజ్వాల్
13 జనవరి - రెండవ శనివారం - ప్రభుత్వ సెలవు
14 జనవరి - ఆదివారం(వారపు సెలవు) - ప్రభుత్వ సెలవు
15 జనవరి - ఉత్తరాయణ పుణ్యకాలం/మకర సంక్రాంతి/మాఘే సంక్రాంతి/పొంగల్/మఘ్ బిహు - బెంగళూరు, చెన్నై, గాంగ్టక్, గౌహతి, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
16 జనవరి - తిరువల్లువర్ డే - చెన్నై
17 జనవరి - ఉజావర్ తిరునాల్ - చెన్నై
జనవరి 21 - ఆదివారం (వారపు సెలవు) - ప్రభుత్వ సెలవు
22 జనవరి - ఇమోిను ఇరట్ప - ఇంఫాల్
23 జనవరి - గాన్- నాగై - ఇంఫాల్
25 జనవరి - థాయ్ పూసం/మహమ్మద్ హజ్రత్ అలీ పుట్టినరోజు - చెన్నై, కాన్పూర్ మరియు లక్నో
26 జనవరి - గణతంత్ర దినోత్సవం - ప్రభుత్వ సెలవు
27 జనవరి - నాల్గవ శనివారం - ప్రభుత్వ సెలవు
28 జనవరి - ఆదివారం - ప్రభుత్వ సెలవు