దూసుకొస్తున్న పల్సర్‌ 250.. రేపే లాంచింగ్.. బైక్‌ లవర్స్‌కి పండగే.!

Bajaj Pulsar 250 India launch tomorrow. బైక్‌ ప్రేమికులు మరో శుభవార్త అందించింది ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం బజాజ్. రేపు సరికొత్త బజాజ్‌ పల్సర్‌ 250 బైక్‌ను లాంచ్‌

By అంజి  Published on  27 Oct 2021 6:06 PM IST
దూసుకొస్తున్న పల్సర్‌ 250.. రేపే లాంచింగ్.. బైక్‌ లవర్స్‌కి పండగే.!

బైక్‌ ప్రేమికులు మరో శుభవార్త అందించింది ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం బజాజ్. రేపు సరికొత్త బజాజ్‌ పల్సర్‌ 250 బైక్‌ను లాంచ్‌ చేయనుంది. రేపటి నుండి భారత విపణిలోకి పల్సర్‌ 250 కొత్త బైక్‌లు రానున్నాయి. బజాజ్‌ పల్సర్‌ 250 ఎఫ్‌, బజాజ్‌ పల్సర్‌ 250లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ 2021 బజాజ్‌ పల్సర్‌ 250 బైక్‌లో కొత్త 250 సీసీ ఎయిర్‌/ఆయిల్‌ - కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 22 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పి చేయగలదు. 6-స్పీడ్‌ గేర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఈ బైక్‌లో ఉండనుంది. బజాజ్‌ పల్సర్‌ 250కి స్ట్రీట్‌ ఫైటర్‌ లుక్‌ను అమర్చారు. అలాగే పల్సర్‌ 250 ఎఫ్‌కి సెమీ ఫెయిర్డ్‌ సెటప్‌ను పొందుపర్చారు.

రేపు రిలీజ్‌ అయ్యే ఈ రెండు బైక్‌ మోడళ్లలో సేమ్‌ ఇంజిన్‌ సెటప్‌ ఉంది. కానీ స్టైలింగ్‌, ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మాత్రం విభిన్నంగా ఉన్నాయి. అల్లాయ్‌ వీల్స్‌, బ్యాక్‌ మోనోషాక్‌ సస్పెన్సణ్‌, టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌, ఇండికేటర్స్‌, స్ల్పిట్‌ సీట్‌, ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్‌లను ఈ బైక్‌లు కలిగి ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో ధరలు సైతం డిఫరెంట్‌గానే ఉన్నాయి. పల్సర్‌ 250 ఎఫ్‌ ఎక్స్‌ షోరూమ్‌ ప్రైస్‌ రూ.1.45 లక్షలుగా ఉండనుంది. అలాగే బజాజ్‌ పల్సర్‌ 250 ఎక్స్‌ షోరూమ్‌ ప్రైస్‌ రూ.1.35 లక్షలుగా ఉండనుంది.

Next Story