ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ బైక్ లాంఛ్ చేసిన బజాజ్

బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ 'ఫ్రీడమ్ 125'ను లాంఛ్ చేసింది.

By Medi Samrat  Published on  5 July 2024 11:22 AM GMT
ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ బైక్ లాంఛ్ చేసిన బజాజ్

బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ 'ఫ్రీడమ్ 125'ను లాంఛ్ చేసింది. బైక్ ప్రారంభ ధర రూ. 95,000 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ఈ మోటార్‌సైకిల్ CNG మోడ్‌లో కేజీకి 102 కిలోమీటర్లు, పెట్రోల్ మోడ్‌లో లీటర్ కు 65 కిలోమీటర్లు మైలేజీని అందిస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 డ్రమ్, డ్రమ్ LED , డిస్క్ LED అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

ఫ్రీడమ్ 125 NG04 డ్రమ్ - రూ. 95,000

ఫ్రీడమ్ 125 NG04 డ్రమ్ LED - రూ. 1.05 లక్షలు

ఫ్రీడమ్ 125 NG04 డిస్క్ LED - రూ. 1.10 లక్షలు

బజాజ్ ఫ్రీడమ్ 125 125cc ఇంజన్‌తో వస్తుంది. సీటు కింద సీఎన్‌జీ ట్యాంక్‌ను ఉంచారు. రెండు వేర్వేరు ఇంధన ట్యాంకులు ఉన్నాయి, ఒకటి పెట్రోల్ కోసం కాగా.. మరొకటి CNG కోసం. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 2 లీటర్లు మాత్రమే. CNG ట్యాంక్ లో 2 కిలోగ్రాముల ఇంధనాన్ని ఉంచవచ్చు. పొడవైన సీటు, లింక్డ్ మోనోషాక్‌ను కలిగి ఉంది. ప్రస్తుతానికి, ఈ మోటార్‌సైకిల్ మహారాష్ట్ర, గుజరాత్‌లలో అందుబాటులో ఉంది. వచ్చే త్రైమాసికం నుంచి దేశవ్యాప్తంగా దశలవారీగా దీన్ని ప్రవేశపెట్టనున్నారు.

Next Story