సామూహిక వివాహాలు చేసిన అంబానీ కుటుంబం.. బహుమతులు ఏమి ఇచ్చారో తెలుసా.?

నీతా, ముఖేష్ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన 50 మంది నిరుపేద జంటలకు జూలై 2న సామూహిక వివాహాన్ని నిర్వహించారు.

By Medi Samrat  Published on  2 July 2024 8:45 PM IST
సామూహిక వివాహాలు చేసిన అంబానీ కుటుంబం.. బహుమతులు ఏమి ఇచ్చారో తెలుసా.?

నీతా, ముఖేష్ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు.. మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన 50 మంది నిరుపేద జంటలకు జూలై 2న సామూహిక వివాహాన్ని నిర్వహించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12న ముంబైలో వివాహం చేసుకోనుండగా.. అంతకు ముందు అంబానీ కుటుంబం సామూహిక వివాహాలను నిర్వహించారు. థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నీతా, ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ హాజరయ్యారు.

ప్రతి జంటకు మంగళసూత్రం, పెళ్లి ఉంగరాలు, ముక్కుపుడకలతో సహా బంగారు ఆభరణాలు అందజేశారు. పలు వెండి ఆభరణాలను కూడా బహుమతులు ఇచ్చారు. ప్రతి వధువుకు ‘స్త్రీధన్’గా రూ. 1.01 లక్షల చెక్కును అందించారు. జంటలకు సంవత్సరానికి సరిపడా కిరాణా సామాగ్రి, గృహోపకరణాలను కూడా పొందారు. ఇందులో వివిధ రకాలైన 36 అవసరమైన వస్తువులు, పాత్రలు, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఫ్యాన్ వంటి ఉపకరణాలు, అలాగే ఒక పరుపు, దిండ్లు ఉన్నాయి. వివాహాల అనంతరం గొప్పగా విందు ఏర్పాటు చేశారు.

Next Story