నాన్ మెట్రో నగరాలలో అమెజాన్ సేమ్-డే డెలివరీ సదుపాయం
Amazon same-day delivery facility now in non-metros. అమెజాన్ ఇండియా నేడు భారతదేశ వ్యాప్తంగా 50కు పైగా నగరాలు, పట్టణాల్లో కొన్ని గంటల్లోనే
By Medi Samrat Published on 27 Sept 2022 7:19 PM ISTఅమెజాన్ ఇండియా నేడు భారతదేశ వ్యాప్తంగా 50కు పైగా నగరాలు, పట్టణాల్లో కొన్ని గంటల్లోనే ప్రైమ్ సభ్యులకు సేమ్-డే డెలివరీని విస్తరించింది. 4 గంటలలోపే వినియోగదారులు ఆర్డర్ చేసిన వాటిని పంపిణీ చేస్తామని ప్రకటించింది. వైర్‌లెస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు, బొమ్మలు, బేబీ ప్రొడక్ట్స్, మీడియా, కిచెన్, లగ్జరీ, క్రీడలు, వీడియో గేమ్స, పర్సనల్ కేర్ తదితర విభాగాల్లో అమెజాన్ వస్తువులను డెలివరీ చేయనుంది. కొన్ని గంటల్లో సేమ్-డే డెలివరి గత ఏడాదితో పోల్చితే 2.5 రెట్లు ఎక్కువ పిన్‌కోడ్‌లలో అందుబాటులో ఉండగా, 14 నగరాల నుంచి ఈ ఏడాది 50 నగరాలు, పట్టణాలకు విస్తరించంది. అందులో , తెలంగాణలోని సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్‌లు ఉన్నాయి.
అమెజాన్ మొదటిగా భారతదేశంలో 2017లో సేమ్-డే డెలివరీని పరిచయం చేసింది. ఒన్-డే, సేమ్-డే నెట్‌వర్కుల విస్తరణతో అమెజాన్ తన వినియోగదారులకు వేగంగా, విశ్వసనీయతతో, అనుకూలకరంగా పంపిణీ ఎంపికలను చేసేందుకు తన పెట్టుబడులను కొనసాగించింది. వేగవంతమైన డెలివరీని సాధ్యం చేసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వ్యూహాత్మంగా ఈ ఆర్డర్లను పంపిణీ చేసేందుకు ప్రత్యేక భవంతులను కలిగి ఉంది. ఈ ప్రత్యేక భవంతులను వేగవంతమైన క్లిక్-టు-డెలివరీ వేగానికి అనుగుణంగా ఉన్నతీకరించారు. ఇవి వినియోగదారుల నివాసాలకు చేరువగా ఉంటాయి.
''మేము మా వినియోగదారులకు అత్యుత్తమమైన వారిగా ఉండేందుకు ఎల్లప్పుడూ నూతన స్థాయి అనుకూలత మరియు డెలివరీ ఎంపికలను అందించేలా ఆవిష్కరణలను చేస్తున్నాము; వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు, వేగం, మరియు అనుకూలతలను కల్పించే కొన్నే గంటల్లో డెలివరీ చేయగలిగిన సేమ్-డే డెలివరీ దానికి సరికొత్త ఉదాహరణ. వినియోగదారులకు కావలసిన ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేసే ఉద్దేశంతో తక్కువ సేవలు అందుకుంటున్న మెట్రోల వెలుపల నగరాలు, పట్టణాల్లో పరిచయం చేసేందుకు ఉత్సుకతతో ఉన్నాము. దానికి వినియోగదారుల నివాసాలకు సమీపంలో ఉన్న ప్రత్యేక భవంతుల్లో అవసరమైన వస్తువులను సేకరించి అలాగే మా డెలివరీ నెట్‌వర్కు వినియోగదారులకు మరియు ప్రైమ్ సభ్యులకు చేరువగా ఉండేలా చేయడంతో ఇది సాధ్యమైంది. సేమ్-డే డెలివరీ అసోసియేట్లకు, ముఖ్యంగా నగరంలోపల ఉండే ప్రాంతాలకు మహోన్నత ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాము'' అని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్, సప్లై చైన్ అండ్ అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అభినవ్ సింగ్ తెలిపారు.
అమెజాన్ ఇండియా అన్ని 100% మేర సర్వీస్ చేయదగిన పిన్‌కోడ్‌లకు డెలివరీ అందిస్తుండగా, 97% కన్నా ఎక్కువ పిన్‌కోడ్‌లకు ఇప్పుడు ఆర్డర్ చేసిన 2 రోజుల లోపల డెలివరీలను అందించగలుగుతుంది. కంపెనీ ప్రైమ్ సభ్యులకు తన ఉచిత ఒన్‌డే మరియు అదే రోజు డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు పెట్టుబడులను కొనసాగించింది. కంపెనీ వేగంగా గత ఏడాది కన్నా ఎక్కువగా సేమ్-డే డెలివరీ సేవల్లో ఏడాది నుంచి ఏడాదికి 2 రెట్లు ఎక్కువ సేవలను వినియోగదారులకు అందిస్తోంది. కంపెనీ 2021లో ప్రైమ్ సభ్యులకు ప్రతి వారం డెలివరీ చేయవలసిన రోజును ఎంపిక చేసుకునే అవకాశాన్ని అందించింది. వినియోగదరులు వారం మొత్తం కొనుగోలు చేస్తుంటే, దాన్ని గ్రూపు చేసి ఒకేసారి పంపిణీ చేస్తోంది. సులభంగా అందుబాటు అలాగే, ఉత్తమ అనుకూలతకు వినియోగదారులు నిర్ణయించిన 'పికప్ పాయింట్ల' నుంచి ప్యాకేజ్‌లను తీసుకుని వెళ్లే ఎంపిక కూడా అందిస్తోంది. వినియోగదారులు ఈ పాయింట్లను అమెజాన్.ఇన్ (Amazon.in)లో కొనుగోలు చేసే సమయంలో చెకౌట్ పుటలో పికప్ కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.