అల్లు అర్జున్ తో జ‌త‌క‌ట్టిన 'ఆస్ట్రల్'

Allu Arjun is Astral Brand Ambassador. బిల్డింగ్ మెటీరియల్స్‌ను అందించే అగ్రగామి కంపెనీలలో ఒకటైన ఆస్ట్రల్ లిమిటెడ్

By Medi Samrat  Published on  19 Jun 2022 1:45 PM GMT
అల్లు అర్జున్ తో జ‌త‌క‌ట్టిన ఆస్ట్రల్

బిల్డింగ్ మెటీరియల్స్‌ను అందించే అగ్రగామి కంపెనీలలో ఒకటైన ఆస్ట్రల్ లిమిటెడ్ అల్లు అర్జున్‌తో జత కట్టి తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ బంధం ఆస్ట్రల్ పైప్స్ ఎకోసిస్టమ్ అంతటికీ మరింత విలువను, ప్రాముఖ్యాన్ని జోడించి, మార్కెట్‌లో వ్యాపార‌ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని కంపెనీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఈ భాగస్వామ్యం గురించి ఆస్ట్రల్‌కు చెందిన ఇంజనీర్ కైరవ్ ఇలా అన్నారు.. ఈ భాగస్వామ్యం మేము ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నామని సూచిస్తోంది. ఎందుకంటే.. అల్లు అర్జున్ తన విశిష్టమైన నటన, డ్యాన్సింగ్ స్టైల్స్ తో తనకున్న అశేష అభిమానుల ఫాలోయింగ్‌తో విశ్వవిఖ్యాతి పొందారు. దక్షిణ భారత రాష్ట్రాలలో మా బ్రాండ్ ను బలోపేతం చేసుకునేందుకు.. కస్టమర్లు మా బ్రాండ్‌ను ఎంచుకునే లక్ష్యంగా ఆయనను భాగస్వామిగా చేసుకున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అత్యంత ప్రజాదరణ కలిగిన స్టార్ అల్లు అర్జున్‌ ఈ ప్రాంతీయ అనుసంధానానికి జత కడితే మార్కెట్‌లో మేము బలంగా నిలదొక్కుకునేందుకు, మార్కెట్ షేర్‌ను పెంచుకునేందుకు మాకు బాగా సహాయపడతారని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "ఇంటింటా మార్మోగుతున్న నాణ్యతకు, నూతన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన.. ఎంతో ముందు చూపు కలిగిన బ్రాండ్ అయిన ఆస్ట్రల్ పైప్స్ తో జత కడుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. బ్రాండ్ యొక్క వైవిధ్యభరితమైన శ్రేణిని నేను ప్రపంచానికి చాటి చెప్పగలను, ఈ బంధంతో ఒక్కటై ప్రయాణించాలని ఎదురుచూస్తున్నానని అన్నారు.

ఇదిలావుంటే.. ఆస్ట్రల్ లిమిటెడ్ పైపింగ్ వ్యాపారంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటి. దక్షిణ భారతదేశం ఆస్ట్రల్ లిమిటెడ్‌కు భారీ మార్కెట్‌గా గుర్తించబడింది. పైపులు, బిల్డింగ్ మెటీరియల్స్ తో బాటుగా, ఇతర నిర్మాణ సామగ్రి శాఖలైన వాటర్ ట్యాంక్‌లు, శానిటరీవేర్ వంటి వైవిధ్యభరితమైన శ్రేణిని కూడా ఆస్ట్రల్ అందిస్తోంది.





















Next Story