2022 మొద‌టి అర్థ సంవత్సరంలో గణనీయమైన వృద్ధిని నమోదుచేసిన అలీస్‌ బ్లూ

Alice Blue Posts Significant Growth for half year ended June 2022. క్యాలెండర్‌ సంవత్సరం మొదటి అర్ధభాగంలో అలీస్‌ బ్లూ సానుకూల వృద్ధి

By Medi Samrat  Published on  27 Aug 2022 11:00 AM GMT
2022 మొద‌టి అర్థ సంవత్సరంలో గణనీయమైన వృద్ధిని నమోదుచేసిన అలీస్‌ బ్లూ

క్యాలెండర్‌ సంవత్సరం మొదటి అర్ధభాగంలో అలీస్‌ బ్లూ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. ఈ కంపెనీ తమ అన్ని వాణిజ్య విభాగాలలోనూ మొత్తంమీద 18% వృద్ధిని నమోదు చేసింది. ఆధునీకరించిన ట్రేడింగ్‌ యాప్స్‌, పరిష్కారాల ద్వారా వినియోగదారులకు తగిన సౌకర్యం ఇది అందిస్తుంది.

ఈ సంవత్సరపు మొదటి ఆరు నెలల కాలంలో కొన్ని విభాగాలు అసాధారణ వృద్ధి సాధించాయి. గత సంవత్సరంతో పోలిస్తే 2022 మొదటి ఆరు నెలల కాలంలో 31% వృద్ధి నమోదు చేసింది. అదే రీతిలో బంగారం ట్రెడింగ్‌లో 21%, డెరివేటివ్స్‌ 13%, ఈక్విటీ ట్రేడింగ్‌లో 9% వృద్ధి నమోదుచేసింది.

అలీస్‌ బ్లూ ఫౌండర్‌–సీఈఓ సిద్ధవేలాయుధం ఎం మాట్లాడుతూ ''స్థిరంగా ఈ కంపెనీ మెరుగైన ట్రేడింగ్‌ యాక్టివిటీని చూస్తుంది. ఇది మహిళా ట్రేడర్లతో పాటుగా నూతన మదుపరుల నుంచి ట్రేడింగ్‌ యాక్టివిటీ చూస్తోంది. ఇది క్యాపిటల్‌ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి ఆసక్తికీ ప్రతిరూపంగా నిలుస్తుంది. మా సాంకేతిక ఆధారిత ప్లాట్‌ఫామ్స్‌యువతరం తమ మొబైల్‌ ఫోన్ల నుంచి నేరుగా మార్కెట్‌లను చేరుకునే అవకాశం అందిస్తుంది'' అని అన్నారు

అలీస్‌ బ్లూ ఇప్పుడు అత్యంత విలాసవంతమైన మార్కెట్‌ప్లేస్‌ను ఉత్పత్తుల ట్రేడింగ్‌ కోసం అందిస్తుంది. దీనిని ట్రేడ్‌ స్టోర్‌ అంటున్నారు. ఇది వినియెగదారులకు ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాలు, జీరో బ్రోకరేజీ ఫీజులతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి వంటి అవకాశాలను అందిస్తుంది. అదనంగా కంపెనీలో అతి సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు యుపీఐ లావాదేవీల ద్వారా ఐపీఓలలో పెట్టుబడి పెట్టేఅవకాశమూ అందిస్తుంది.

ఆన్‌లైన్‌ సేవలతో పాటుగా అలీస్‌ బ్లూ ఇప్పుడు 20 ప్రధాన నగరాలలో 12వేల అసోసియేట్ల ద్వారా వినియోగదారుల ట్రేడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాలను తీరుస్తోంది.


Next Story