టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ సోమవారం టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్, డేటా టాప్ అప్‌లతో సహా వివిధ ప్రీపెయిడ్ ఆఫర్‌ల కోసం 20-25% టారిఫ్‌ల (ప్రీపెయిడ్ చార్జీల)ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ-లెవల్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్ దాదాపు 25% పెంచబడింది. పెరిగిన ఛార్జీలు నవంబర్ 26, 2021 నుండి అమలులోకి వస్తాయి. ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనా కోసం అనుమతించే మూలధనంపై సహేతుకమైన రాబడిని అందించడానికి ఈ విధానం తోడ్పనున్నట్లు కంపెనీ వివరించింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం (ARPU) రూ.200 నుండి రూ.300 వద్ద ఉండాలని కంపెనీ భావిస్తోంది.
ఈ స్థాయి ARPU నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్‌లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులకు ఛాన్స్ ఏర్పడుతుందని, ఇది భారతదేశంలో 5Gని విడుదల చేయడానికి ఉపయోగపడుతుందని అని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దిశగా తొలి అడుగుగా నవంబర్ నెల చివరలో పెరిగిన ఛార్జీలతో తిరిగి సమతుల్యం చేయాలని నిర్ణయించామని కంపెనీ పేర్కొంది. పెరిగిన ఛార్జీల ప్రకారం.. వాయిస్ ప్లాన్‌లలో కొత్త ప్రస్తుతం రూ.79 రూపాయల 28 రోజుల ప్లాన్‌ను రూ.99కి మార్చనున్నారు. రూ.99 రిచార్జీతో 50 శాతం ఎక్కువ టాక్‌టైమ్, 200 ఎంబీ డేటా, 1 పైసా/ సెకన్ వంటి ప్రయోజనాలు కల్పించనున్నారు.