తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12,400 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో బహుళ వ్యాపారాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది.

By అంజి  Published on  17 Jan 2024 6:08 AM GMT
Adani Group, Investments, Telangana, CM Revanth Reddy

తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12,400 కోట్ల పెట్టుబడులు 

దావోస్: తెలంగాణలో బహుళ వ్యాపారాల్లో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీఈ అండ్ సీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రెసిడెంట్, సీఈవో ఆశిష్ రాజ్‌వంశీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. రాబోయే కొన్నేళ్లలో తెలంగాణలో ఈ పెట్టుబడులు వస్తాయి.

తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

చందన్‌వెల్లిలో మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి అదానీ కాన్నెక్స్ డేటా సెంటర్లు రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.

అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో తెలంగాణలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌లో రూ. 1,400 కోట్లు పెట్టుబడి పెడుతుంది.

అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్‌లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిస్సైల్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్లలో రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, మద్దతునిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు.

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇలా అన్నారు: ''తెలంగాణలోని కొత్త ప్రభుత్వం పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైనది. కొత్త ప్రణాళికాబద్ధమైన విధానాలతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలి. అందించిన వాటితో తెలంగాణలో అదానీ గ్రూప్ అధిక వేగంతో అభివృద్ధి చెందుతుంది''. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు, ఐటీఈ అండ్ సీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Next Story