2 లక్షలకు పైగా పుస్తకాలతో భారీ బుక్ ఫెయిర్‌

4 days book fair will be organized in hyderabad for book lovers. పుస్త‌క ప్రేమికుల కోసం కితాబ్‌ లవర్స్‌ ఓ బుక్‌ ఫెయిర్‌ను నిర్వహించబోతున్నారు.

By Medi Samrat  Published on  19 April 2022 6:53 PM IST
2 లక్షలకు పైగా పుస్తకాలతో భారీ బుక్ ఫెయిర్‌

పుస్త‌క ప్రేమికుల కోసం కితాబ్‌ లవర్స్‌ ఓ బుక్‌ ఫెయిర్‌ను నిర్వహించబోతున్నారు. ఈ బుక్‌ ఫెయిర్‌లో వేలాది మంది రచయితలు వేలాది అంశాలపై రచించిన 2 లక్షలకు పైగా పుస్తకాలను ప్రదర్శించనున్నారు. భారీ సంఖ్యలో రచయితలు, విద్యార్థులు, పుస్తక ప్రియులను ఈ బుక్‌ ఫెయిర్‌ ఆహ్వానిస్తోంది. ఈ సమాచారాన్ని నిర్వహణ బృంద సభ్యుడు, పుస్తక ప్రేమికుడు హర్‌ప్రీత్‌ సింగ్‌ చావ్లా వెల్లడించారు. ఆయన బుక్‌ ఫెయిర్ కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ.. పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ ప్రాంగణం వద్ద ఉన్న ఎక్స్‌పో గ్యాలరియాలో ఏప్రిల్‌ 21 నుంచి ఏప్రిల్‌ 24వ తేదీ వరకూ ఈ ప్రదర్శన చేయనున్నామన్నారు. ఈ బుక్‌ ఫెయిర్‌ ముఖ్యోద్దేశ్యం.. ఈ డిజిటల్‌ ప్రపంచంలో పుస్తకాలు, సాహిత్యానికి దూరంగా ఉన్న యువతకు పుస్తక ఆవశ్యకతను తెలుపడమ‌ని అన్నారు.

చేతిలో పుస్తకం ఉంచుకుని చదువుతుంటే ఆ ఆనందం విభిన్నంగా ఉంటుందని అన్నారు. వేలాది మంది రచించిన 2 లక్షలకు పైగా పుస్తకాలను ప్రదర్శించనున్నామన్నారు. వీటిలో బయోగ్రఫీ, క్రైమ్‌, అస్ట్రాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌, కుకింగ్‌, డిక్షనరీస్‌, ఫోటోగ్రఫీ, వైల్డ్‌లైఫ్‌, ఎన్‌సైక్లోపిడియా, రొమాన్స్‌, ఫ్యాంటసీ, మతం, శాస్త్రం వంటి వాటితో పాటుగా సాహిత్యం, స్టోరీ టెల్లింగ్‌, కవిత్వ పుస్తకాలు కూడా ఉంటాయి. ఇంగ్లీష్‌. హిందీ భాషలలో వేలాది మంది రచయితలు రచించిన పుస్తకాలను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. పలు అంశాలలో అత్య‌ధికంగా అమ్ముడైన‌ పుస్తకాలను సైతం ఇక్కడ ప్రదర్శించనున్నారు. కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా బుక్ పెయిర్‌ను నిర్వహించనున్నట్లు చావ్లా తెలిపారు.











Next Story