Fact Check : లండన్ నుండి కలకత్తాకు బస్ ప్రయాణం చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2020 5:40 AM GMT
Fact Check : లండన్ నుండి కలకత్తాకు బస్ ప్రయాణం చేశారా..?

ట్రావెలింగ్.. ఇప్పుడు ఒక ఊరు నుండి మరో ఊరు వెళ్లాలంటేనే చాలా కష్టంగా ఉంది. సొంత వాహనాలు, ప్రత్యేకమైన పర్మిషన్స్ ఉంటేనే ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉంది. ఇక విదేశాలకు వెళ్లడం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది గగనమే..! చాలా దేశాలు ఇంకా విదేశీ ప్రయాణీకులను అనుమతి ఇవ్వడం లేదు. అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకూ రద్దయ్యాయి. సర్వీసులు తెరచినా విదేశాలకు వెళ్ళాలి అంటే ప్రజలు జంకుతూ ఉన్నారు.

ఇక ఒక దేశం నుండి మరో దేశానికి బస్సులో ప్రయాణమంటే అసలు జరిగే పనేనా అని అడుగుతూ ఉన్నారు. కానీ ఒకప్పుడు లండన్ నుండి భారతదేశంలోని కలకత్తాకు బస్సులో వచ్చారంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. లండన్ లో మొదలైన బస్సు ప్రయాణం బెల్జియం, జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లోవియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల మీదుగా వచ్చి భారత్ లోని కలకత్తాకు చేరుకుంది.

“Did you know about a luxury bus service from London to Kolkata which existed till up to 1970s? It started from UK-Belgium-Germany-Austria-Yugoslavia-Bulgaria-Turkey-Iran-Afghanistan-Pakistan-India. It included of travel-food-accommodation-sightseeing. Here are the photos and the itinerary for this wonderful bus service.“ అంటూ పలువురు ఫేస్ బుక్ లో ఈ ప్రయాణం గురించి కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. 1970 వరకూ లగ్జరీ బస్సు సర్వీసు లండన్ నుండి కలకత్తా దాకా ఉండేదని.. ప్రయాణంతో పాటూ, భోజనం, రాత్రి పూట బస, ప్రముఖ ప్రాంతాలు చూసేలా ఈ టూర్ ప్లాన్ లో ఉండేవి.

కొందరు నేను కూడా ఆ ప్రయాణం చేసి ఉంటే బాగున్ను, 1950, 60 లలో ఈ బస్సు సర్వీసు ఉండేదట. మొత్తం 50 రోజుల పాటూ ఈ రోడ్ ట్రిప్ ఉండేదని పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ వచ్చారు.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. 1950 లో విక్టోరియా కోచ్ స్టేషన్ లో ఈ ఫోటోలను తీశారు, ప్రయాణీకులు ఎక్కుతున్న బస్సు పేరు 'ఆల్బర్ట్' అని పలువురు షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులు నిజమే..!

గూగుల్ రివర్స్ ఇమేజ్ చేయగా ఎన్నో వెబ్ సైట్స్ లండన్ నుండి కలకత్తాకు బస్ సర్వీస్ ఉండేదని ఆల్బర్ట్ టూర్స్ సంస్థ ఈ సర్వీసులను నడుపుతూ ఉండేదని స్పష్టం చేశారు.

Shutterstock, Getty సంస్థల వద్ద కూడా 'లండన్ నుండి కలకత్తాకు బస్ ట్రిప్ 1957' కు సంబంధించిన ఫోటోలు లభ్యమయ్యాయి.

https://www.shutterstock.com/editorial/search/london-to-calcutta-bus-trip-1957

https://www.gettyimages.co.uk/detail/news-photo/passengers-at-victoria-coach-station-london-boarding-the-news-photo/85574538

blogspot highroadforoz లో కూడా 1968లో ఆల్బర్ట్ బస్ కు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు. సిడ్నీ నుండి లండన్ వయా కలకత్తాకు చెందిన బస్ కూడా ఉండేది. కొన్ని నెలల తర్వాత రిటర్న్ ట్రిప్ వేసే వారు.

లండన్ నుండి కలకత్తాకు వెళ్లాలంటే 85 పౌండ్లు అప్పట్లో చెల్లించేవారు. అంటే 8000 రూపాయలతో సమానం. అప్పట్లో కొంచెం పెద్ద అమౌంట్ లాగే దాన్ని పరిగణించేవారు. ఆల్బర్ట్ బస్ మొదటి రన్ ఏప్రిల్ 15, 1957 న మొదలవ్వగా జూన్ 5 నాటికి కలకత్తా చేరుకుంది.

https://edtimes.in/are-these-images-of-a-bus-from-london-to-calcutta-fake/

1968 లో బస్ ట్రిప్ ను సిడ్నీ వరకూ కొనసాగించారు. అక్టోబర్ 8, 1968 లో మొదలైన ట్రిప్ 132 రోజుల పాటూ కొనసాగింది. ఫిబ్రవరి 17, 1969న ఈ రోడ్ ట్రిప్ ముగిసింది.

https://hooniverse.com/meet-albert-a-bus-to-show-you-the-world/

అప్పటి ట్రిప్ కు సంబంధించిన టికెట్ రేటుకు సంబంధించిన బ్రోచర్ ను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

Travellers Wanted…: 1968: Sydney to London in a double-decker bus అనే పుస్తకాన్ని ఈ ప్రయాణం గురించి జాన్ వార్డ్ అనే వ్యక్తి రాశాడు. 1968లో సిడ్నీ నుండి లండన్ కు బస్ ప్రయాణం 1968లో ఎలా జరిగిందో వివరిస్తూ రాశాడు. అమెజాన్ లో ఈ బుక్ అందుబాటులో ఉంది.

లండన్ నుండి కలకత్తాకు బస్సు ప్రయాణం చేశారన్నది 'నిజమే'

Next Story