Budget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. బడ్జెట్ హైలైట్స్ ఇవీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ముగిసింది. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈసారి కాస్త తొందరగానే కేంద్రమంత్రి ప్రసంగం ముగిసింది.
By అంజి Published on 1 Feb 2024 12:32 PM ISTBudget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. బడ్జెట్ హైలైట్స్ ఇవీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ముగిసింది. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈసారి కాస్త తొందరగానే కేంద్రమంత్రి ప్రసంగం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక ఏడాదిలో భారత దేశ ద్రవ్యలోటు జీడీపీలో 5.1శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవు’ అని నిర్మల స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వికాస్ భారత లక్ష్యాన్ని వేగవంతం చేసి విధంగా తమ ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ని ప్రకటిస్తుంది అని నిర్మల స్పష్టం చేశారు.
“జీడీపీ అర్థాన్ని ఈ ప్రభుత్వం మార్చింది. జీడీపీ అంటే ఇప్పుడు.. గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్,” అని నిర్మల అన్నారు. భారత్‌లో అన్ని రంగాల్లోనూ ప్రగతి కనిపిస్తోందని, ప్రజల ఆదాయం 50 శాతం పెరిగిందని అన్నారు. బడ్జెట్ సమర్పణ అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
బడ్జెట్ హైలైట్స్ ఇవీ
40 వేల రైలు బోగీలను వందేభారత్ ప్రమాణాలతో మార్పులు
విమానాశ్రయాల అభివృద్ధి
‘డీప్ టెక్’ టెక్నాలజీస్ కోసం కొత్త పథకం
దేశంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు.. ఆశా కార్యకర్తలు అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకంలో హెల్త్ కవర్ వర్తింపు
సాంకేతిక రంగానికి 50 ఏళ్ల కాలానికి వడ్డీ రహిత రుణాలు ఇచ్చేలా లక్షల కోట్లతో కార్పస్ ఫండ్
సంస్కరణల అమలు కోసం రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణాలు రూ. 75 వేల కోట్ల మేర ఇస్తాం.
దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కుల ఏర్పాటు
రానున్న ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచేందుకు కమిటీ ఏర్పాటు
రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ సరఫరా.