బడ్జెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న జనం.. ట్యాక్స్ స్లాబ్‌లను మారుస్తారా.?

కేంద్ర ప్రభుత్వం 2024 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులకు

By Medi Samrat  Published on  23 Jan 2024 5:36 PM IST
బడ్జెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న జనం.. ట్యాక్స్ స్లాబ్‌లను మారుస్తారా.?

కేంద్ర ప్రభుత్వం 2024 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది. ఈ క్రమంలో పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2014 నుంచి ట్యాక్స్ స్లాబ్‌లను మార్చలేదు. వీటిని రివ్యూ చేయాలని కొందరు కోరుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేయాలని, ఇది గృహాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మధ్యతరగతి ప్రజలకు డిస్పోజబుల్ ఇన్‌కమ్‌ పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు.

ఇక సెక్షన్ 80C కింద ఎగ్జమ్షన్‌ లిమిట్‌ పెంచడం, నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకున్నప్పుడు పన్ను విధించకపోవడం వంటివి జరుగుతాయా అని కూడా ఎదురుచూస్తూ ఉన్నారు.సెక్షన్ 80C, 80CCC, 80 CCD(1) కింద అందుబాటులో ఉన్న డిడక్షన్‌ లిమిట్‌ సవరించాలని పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇది సంవత్సరానికి రూ.1.50 లక్షలుగా ఉంది. చాలా కాలంగా ఈ లిమిట్‌ను మార్చలేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి.

Next Story