Budget 2024: శాఖలు, పథకాల వారీగా బడ్జెట్ కేటాయింపు ఇవే
2023-24 ఆర్థిక సంవత్సరానికి 47.66 లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.
By అంజి Published on 1 Feb 2024 1:20 PM ISTBudget 2024: శాఖలు, పథకాల వారీగా బడ్జెట్ కేటాయింపు ఇవే
2023-24 ఆర్థిక సంవత్సరానికి 47.66 లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. రాబోయే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధి, సంక్షేమం ప్రథమ ప్రాధామ్యం కావాలన్న ప్రధాని మోదీ సూచన మేరకే బడ్జెట్ రూపొందించామన్నారు.
శాఖల వారీగా కేటాయింపులు..
- మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
- రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు
- రైల్వేశాఖకు రూ.2.55లక్షల కోట్లు
- హోంశాఖకు రూ.2.03లక్షల కోట్లు
- వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77లక్షల కోట్లు
- ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78లక్షలకోట్లు
- ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13లక్షల కోట్లు
- రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68లక్షలకోట్లు
- కమ్యూనికేషన్ రంగానికి రూ.1.37లక్షలకోట్లు
కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేలకోట్లు
- ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7500కోట్లు
- పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200కోట్లు
- సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903కోట్లు
- సోలార్ విద్యుత్ గ్రిడ్‌కు రూ.8500కోట్లు
- గ్రీన్ హైడ్రోజన్‌కు రూ.600కోట్లు
- బడ్జెట్ పరిమాణం రూ. 47.66 లక్షల కోట్లు
- వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు