ఆగస్టు నెల మొత్తం.. ఎంతైనా తినండి.. సగం బిల్లు కట్టండి
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అన్ని రంగాలు కుదేలు అయ్యాయి. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు తీవ్రంగా నష్టపోయాయి. చాలా దేశాల్లో హోటళ్లను తెరిచినప్పటకి కరోనా ముప్పుతో ప్రజలు అటు వైపు చూడడం లేదు. ఇంటి భోజనానికే పరిమితం అయ్యారు. దీంతో రెస్టారెంట్లు కస్టమర్లు లేకుండా వెలవెలబోతున్నాయి.
హోటల్ రంగాన్ని ఆదుకునేందుకు యూకే ప్రభుత్వం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. అదేటంటే.. మీకు నచ్చినంత తినండి.. బిల్లు మాత్రం సగమే కట్టండి అంటూ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది “Eat Out To Help Out scheme” కింద ఈ ఆఫర్ ప్రకటించింది. ఇది కేవలం ఒక్క హోటల్‌కు సంబంధించినది కాదు.. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 72వేల రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్బులు ఇలా ఎక్కడికివెళ్లినా.. ఈ ఆఫర్ పని చేస్తుంది. అయితే.. ఈ ఆఫర్ ఆగస్టు నెల మొత్తం అందుబాటులో ఉంటుంది. అది కూడా సోమవారం నుంచి బుధవారం వరకు ఇది వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆహారం, నాన్ ఆల్కాహల్ డ్రింక్స్‌కు మాత్రమే వర్తిస్తుందని.. లిక్కర్‌పై ఈ ఆఫర్ వర్తించదని తెలిపింది. ఈ ఆఫర్ కింద ఓ వ్యక్తి గరిష్టంగా 10పౌండ్లు వరకు డిస్కౌంట్ పొందవచ్చు. తిన్న తరువాత ఎలాంటి వోచర్ లేకుండా సగం బిల్లు కడితే సరిపోతుంది. దీనికి ఎలాంటి నిబంధనలు లేవు. రోజుకు ఎన్ని సార్లు అయినా ఆఫర్ వర్తిస్తుంది.
కరోనా కారణంగా బ్రిటన్‌లో చాలా వరకు వ్యాపారాలు దెబ్బతిన్నారు. ఇటీవల ఆంక్షలు సడలించిన పెద్దగా ప్రయోజనం లేదు. దీంతో ఇలాంటి ఆఫర్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆర్థిక మంత్రి రిషి సునక్ మాట్లాడుతూ.. దేశంలో 18లక్షల మంది చెఫ్‌లు, వెయిటర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగాలను కాపాడడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చామన్నారు. ఆర్థిక వ్యవస్థలో రెస్టారెంట్లు, కేఫ్‌లు బార్లు కీలక పాత్ర పోషిస్తాయని.. ప్రస్తుతం వాటికి పునరుజ్జీవం పోయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మమమ్మారి దరిచేరకుండా.. నిబంధనలను పాటిస్తూ.. ఫుడ్ తింటూ ఎంజాయి్ చేయండంటూ ప్రభుత్వం పేర్కొంది.