కరోనా వ్యాక్సిన్ : వారంలో వచ్చేస్తుందట.. ఎవరు చెబుతున్నారంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2020 7:10 AM GMT
కరోనా వ్యాక్సిన్ : వారంలో వచ్చేస్తుందట.. ఎవరు చెబుతున్నారంటే?

ఎలాంటి అంచనాలు లేకుండా షూటింగ్ జరిగిపోటం.. పెద్ద హడావుడి లేకుండా థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకునే సినిమాల్ని ఇప్పటివరకూ చూశాం. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా వ్యాక్సిన్ ప్రయోగాలుప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ తరహా ప్రయోగాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా.. కేవలం ఐదారు పేర్లు మాత్రమే తరచూ వినిపిస్తూ.. వారు చేసే ప్రయోగాల మీదనే ఆసక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ లెక్కలోకి రాని రష్యా వ్యాక్సిన్.. ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ గా మారిన సదరు రష్యా వ్యాక్సిన్ ను వచ్చే వారమే విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు.

రష్యాకు చెందిన గామాలేయా ఇన్ స్టిట్యూట్ రూపొందించిన వ్యాక్సిన్ మూడు దశల్లో ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. మిగిలింది.. వ్యాక్సిన్ అనుమతులు పొందటం.. వాటిని ఉత్పత్తి చేయటమేనని చెబుతున్నారు. ప్రపంచంలో ఎవరైతే వ్యాక్సిన్ కనుగొంటారో వారికి వచ్చే డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే.. మిగిలిన దేశాలకు భిన్నంగా రష్యా గుట్టుచప్పుడు కాకుండా ప్రయోగాన్ని నిర్వహించటమే కాదు.. మిగిలిన వారితో పోలిస్తే.. రికార్డు స్థాయి సమయంలో పూర్తి చేశారని చెప్పాలి.

అయితే.. రష్యా తయారు చేసినట్లుగా చెబుతున్న వ్యాక్సిన్ పని తీరు మీద బోలెడన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్స్ ఫర్డ్ వర్ిసటీ వ్యాక్సిన్.. అమెరికా నుంచి మోడెర్నా వ్యాక్సిన్ ముందుగా మార్కెట్లోకి వస్తాయన్న అంచనాలకు భిన్నంగా రష్యా వ్యాక్సిన్ రావటంపై పులువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ వ్యాక్సిన్ పని చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న.

ఇలా ప్రపంచ వ్యాప్తంగా పలువురు రష్యా వ్యాక్సిన్ మీద సందేహాల్ని వ్యక్తం చేస్తుంటే.. రష్యా ప్రభుత్వం మాత్రం బోలెడంత నమ్మకంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కరోనా వైరస్ బలహీనపడి.. మామూలు మందులకే చనిపోతున్న వేళ.. వ్యాక్సిన్ అవసరమా? అనేటోళ్లు ఉన్నారు. ఒక అంచనా ప్రకారం డిసెంబరు చివరి వరకు వ్యాక్సిన్ విడుదలకు అవకాశం లేదన్న అంచనాలకు భిన్నంగా మరో వారంలో వ్యాక్సిన్ రానుందన్న వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. వారం వెయిట్ చేస్తే కానీ రష్యా వ్యాక్సిన్ అసలు సంగతేమిటో తేలుతుంది.

Next Story