బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ట్వీట్ ఎటకారంగా మారిందిగా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 7:17 AM GMT
బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ట్వీట్ ఎటకారంగా మారిందిగా?

కీలక స్థానాల్లో ఉండే వారి నోటి నుంచి మాటకు.. చేసే పనులకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. అందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పొరపాటుగా కానీ.. మరే కారణం చేత కానీ జరిగే తప్పులకు నవ్వులపాలు కావటం ఖాయం. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నారు డాక్టర్ అండ్రూ ఫ్లెమింగ్. ఎవరాయన? ఆయనకు తెలుగోళ్లకు లింకేమిటంటారా? అక్కడికే వస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గా ఆయన వ్యవహరిస్తున్నారు.

మిగిలిన వారి మాదిరే ఈ పెద్దాయన కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా అలాంటి పోస్టే పెట్టారు. అంత పెద్దాయన పెట్టిన పోస్టు చూసినంతనే అవాక్కు కావటమే కాదు.. ఇలా ఎలా చేశారబ్బా? అన్న భావన కలుగక మానదు. ఏడువేల కిలోమీటర్లకు పైనే విస్తరించిన ఉన్న హైదరాబాద్ మహానగరంలో మోడ్రన్ హైదరాబాద్అంటూ ఒక భారీ భవన సముదాయాన్ని పోస్టు చేశారు.



ఇంతకీ.. ఆ భారీ భవన సముదాయం ఏమిటంటే.. హైహోం గ్రూపు నిర్మించిన అవతార్ అనే భారీ ప్రాజెక్టు. ఆధునిక హైదరాబాద్ కింద.. మొత్తం సిటీనో.. లేదంటే.. కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాన్ని చూపిస్తుండటం మామూలుగా చేసే పని. అందుకు భిన్నంగా ఒక ప్రైవేటు వెంచర్ భవనాన్ని ఆధునిక హైదరాబాద్ గా చూపించటం చూస్తే.. ఈ పెద్దాయన్ను ఎవరో తప్పుదారి పట్టించి ఉంటారనిపించక మానదు.

ఇలాంటి ఫోటోలతో ఉన్న పేరు పోవటమే కాదు.. హైదరాబాదీయుల మనోభావాల్ని దెబ్బ తీశారన్న విమర్శల్ని ఎదుర్కోవటం ఖాయం. ఇలాంటి వెంచర్లు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ లో బోలెడన్ని కనిపిస్తాయి. అలాంటి వాటిని వదిలేసి.. మైహోం వారి ప్రాజెక్టును ప్రత్యేకంగా చూపించటమేమిటి చెప్మా అన్న సందేహానికి గురి కాక మానరు. ఇప్పటికైనా పెద్ద మనిషి.. ఆ పోస్టు తొలిగిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story