Fact Check : బాయ్‌కాట్ చైనా అని ఉన్న టీ షర్ట్స్, టోపీలు చైనాలో తయారవుతున్నాయా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 3:37 PM IST
Fact Check : బాయ్‌కాట్ చైనా అని ఉన్న టీ షర్ట్స్, టోపీలు చైనాలో తయారవుతున్నాయా..?

భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల కారణంగా 'బాయ్ కాట్ చైనా' అన్న నినాదం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. చైనాకు చెందిన వస్తువులను వాడకూడదంటూ పిలుపును ఇచ్చారు. 'బాయ్ కాట్ చైనా' అన్న పదం ఉన్న టీషర్ట్ లు, క్యాప్ లు కూడా చైనా నుండి వస్తున్నాయంటూ ఓ పోస్టు వైరల్ అవుతోంది. బాయ్ కాట్ చైనా అన్న టీ షర్టులకు భారత్ లో బాగా డిమాండ్ ఉండడంతో చైనా వాటిని తయారు చేసి భారత్ లోకి పంపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.

చైనా వస్తువులను నిషేధించాలంటూ చైనానే టీషర్టులను, క్యాపులను తయారుచేస్తోందని పలువురు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ:

చైనా వస్తువులను నిషేధించాలంటూ చైనానే టీషర్టులను, క్యాపులను తయారుచేస్తోందన్నది 'పచ్చి అబద్ధం'

వైరల్ అవుతున్న ఫోటోలలో Digital Phablet Staff కు సంబంధించిన లోగోను గమనించవచ్చు. జూన్ 4న సదరు వెబ్ సైట్ ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది/

https://www.digitalphablet.com/china-manufacturing-boycott-china-caps-shirts-india/

మరో ఫోటో లో The Fauxy అన్న లోగోను చూడొచ్చు. అందులో జూన్ 1న ‘Boycott China’ ప్రోడక్ట్స్ కు సంబంధించిన వార్తను పబ్లిష్ చేశారు.

https://thefauxy.com/china-manufactures-boycottchina-t-shirts-and-banners-anticipating-the-boycott-china-campaign/

ఇది సాధారణమైన వార్తలను ప్రచురించే మీడియా సంస్థ కాదు. సెటైర్లకు సంబంధించిన వార్తలను పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఈ వార్త కింద కూడా తాము సెటైరికల్ గా వార్తను పబ్లిష్ చేశామంటూ తెలియజేసింది సదరు సంస్థ.

C1

న్యూస్ మీటర్ ‘Boycott China’ అన్న లోగో ఉన్న టీషర్టు లను, క్యాప్ లను సెర్చ్ చేయగా అమెరికా, భారత్ కు చెందిన ఎన్నో కంపెనీలు వీటిని తయారుచేస్తున్నాయి. అందుకు సంబంధించిన లింక్ లు ఇక్కడ చూడొచ్చు.

C2

https://www.stephenandkiara.com/products/china-lied-people-died-t-shirt

C3

https://www.bluehaat.com/pages/contact-us

C4

https://brahmabull.in/community/contact

చైనానే 'బాయ్ కాట్ చైనా' అన్న ప్రొడక్ట్స్ ను తయారుచేస్తోందన్న వార్తలు 'పచ్చి అబద్ధం'.

Claim Review:Fact Check : బాయ్‌కాట్ చైనా అని ఉన్న టీ షర్ట్స్, టోపీలు చైనాలో తయారవుతున్నాయా..?
Claim Fact Check:false
Next Story