నిజమెంత: చైనీస్ యాప్స్ ను కట్టడి చేయాలని ఎన్ఐసి ప్రకటించిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 4:15 AM GMT
నిజమెంత: చైనీస్ యాప్స్ ను కట్టడి చేయాలని ఎన్ఐసి ప్రకటించిందా..?

భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. దీనికంతటికీ కారణమైన చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాయ్ కాట్ చైనా అంటూ ప్రజలు ప్రముఖులు పిలుపును ఇచ్చారు.

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్.ఐ.సి.) చైనీస్ యాప్స్ ను కట్టడి చేయాలని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐఓఎస్ స్టోర్ లను కోరినట్లుగా ఉన్న ఓ సర్క్యులర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎన్.ఐ.సి. లెటర్ హెడ్ ఉన్న ఆఫీసు మెమొరాండంను పలువురు ట్వీట్లు చేస్తున్నారు. గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ హెడ్స్ కు చైనీస్ యాప్స్ ను కట్టడి చేయాలని ఎన్.ఐ.సి. అందులో కోరింది. భారత దేశ సమగ్రతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ అందులో తెలిపింది. ఇప్పటికిప్పుడు గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐఓఎస్ స్టోర్ లలో చైనా యాప్స్ ను కట్టడి చేయాలని కోరారు.

N1

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న సర్క్యులర్ 'పచ్చి అబద్ధం'

జాతీయ స్థాయిలో ఏదైనా యాప్స్ ను వాడకూడని లేదా బహిష్కరించాలని ఆదేశాలు ఇచ్చే అధికారాలు మినిస్ట్రీ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎం.ఇ.ఐ.టి.వై.) కు ఉంటాయి కానీ ఎన్.ఐ.సి. కి ఉండవు. మినిస్ట్రీ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో భాగమైన ఎన్.ఐ.సి. కేంద్రప్రభుత్వం ఈ-గవర్నెన్స్ కు అండగా ఉంటుంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రప్రాంత పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్స్, జిల్లా, ఇతర ప్రభుత్వ రంగాలకు నెట్వర్క్ విషయంలో అండగా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో ఐసిటి సర్వీసులు, జాతీయ స్థాయిలో కమ్యూనికేషన్ నెట్ వర్క్ లను, జాతీయ-స్థానిక ప్రభుత్వాల పనితీరు మెరుగుపరచడానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది.

ఎం.ఇ.ఐ.టి. వెబ్ సైట్ లో ఇలాంటి సర్క్యులర్ ను జారీ చేశారేమోనని చూడగా.. అలాంటిది అందుబాటులో లేదు.

ఎన్.ఐ.సి. వెబ్ సైట్ లో కూడా అలాంటి ఆర్డర్ కనిపించలేదు.



ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ ఆర్డర్ ను 'ఫేక్' అని తేల్చేసింది. ఎం.ఇ.ఐ.టి.వై., ఎన్.ఐ.సి. లు ఇటువంటి ఆర్డర్ ఇవ్వలేదని తేల్చింది.

మినిస్ట్రీ ఆఫ్ ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎన్.ఐ.సి. చైనీస్ యాప్స్ ను కట్టడి చేయాలంటూ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐఓఎస్ స్టోర్ లను కోరినట్లుగా వైరల్ అవుతున్న సర్క్యులర్ లో ఎటువంటి నిజం లేదు.

Claim Review:నిజమెంత: చైనీస్ యాప్స్ ను కట్టడి చేయాలని ఎన్ఐసి ప్రకటించిందా..?
Claim Fact Check:false
Next Story