పచ్చ నేతలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది..
By అంజి
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వంపూ, పోలీసులపై చంద్రబాబు ఘటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పచ్చ నేతలకు లోకమంతా పచ్చగా కనిపించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదన్నారు. చిన్న సంఘటనలను చూపి చంద్రబాబు రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స ఆరోపణలు చేశారు. చంద్రబాబు తన రెచ్చగొట్టే వాఖ్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో గొడవలు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఇక చంద్రబాబు చేస్తున్న పనులకు పవన్ కల్యాణ్ వత్తాసు పలుకుతున్నాడని విమర్శలు చేశారు. ఆయన తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కడుతారని అన్నారు. గత ఐదేళ్ల రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి నెట్టిన చంద్రబాబుకు.. విలువలు, సిద్ధాంతాలు లేవన్నారు. సీఎం జగన్ పథకాలు ఇతర రాష్ట్రల సీఎంలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి బొత్స పేర్కొన్నారు. సీఎం జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని,, సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని అన్నారు.