పెంటకోట వద్ద బోటు బోల్తా.. సముద్రంలో వ్యక్తి గల్లంతు
By తోట వంశీ కుమార్ Published on 15 July 2020 5:15 PM ISTవిశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట సముద్రంలో బుధవారం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఉదయం ఎనిమిది మంది మత్స్యాకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.
కొంత దూరం ప్రయాణించిన తరువాత సముద్రంలో కెరటాల ఉదృతికి వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. దీంతో వారందరూ సముద్రంలో పడిపోయారు. ఏడుగురు మత్స్యకారులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. మేరుగు జగ్గ(30) గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మెరైన్ సిబ్బంది సాయంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన జగ్గ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Next Story