కశ్మీర్‌లో బీజేపీ నేత కిడ్నాప్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2020 8:27 AM GMT
కశ్మీర్‌లో బీజేపీ నేత కిడ్నాప్‌..

ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో బీజీపీ నాయకులపై దాడులు పెరుగుతున్నాయి. గతవారం ఓ బీజేపీ నేతను కాల్చి చంపిన ఘటనను మరువక ముందే తాజాగా మరో స్థానిక బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటన బారాముల్లాలో చోటు చేసుకుంది. మునిసిపల్ కమిటీ వాటర్‌గామ్ ఉపాధ్యక్షుడైన మెరాజుద్దీన్ మల్లాను ఉత్తర కశ్మీర్‌లో కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు మల్లా కోసం గాలింపు చేపట్టాయి.

బందీపోర్లో గతవారం బీజేపీ నాయకుడు షేక్ వసీమ్ బారి, అతని సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్యను బీజేపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది.Next Story
Share it